36గంటలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి
Ens Balu
1
Tirupati
2020-11-25 15:46:41
చిత్తూరు జిల్లాలో పెనుగాలులతో కూడిన తుఫాన్ ’నివర్ ‘ మరో 36 గంటలు ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. భారత్ గుప్తా తెలిపారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. జిల్లా లో నివర్ తుఫాన్ ప్రభావం 26న రాత్రి వరకు వుంటుందని, నేడు 25,రేపు 26 పాఠశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు. తూర్పు మండలాలలు 12 వరకు అధిక ప్రభావం వుండే అవకాశం వుందని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయం అందిస్తున్నామని తెలిపారు. పూరి గుడిసెల్లో వున్నవాళ్లు సహాయ కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కంట్రోల్ రూమ్ నెం. 9100804313 ఏర్పాటు అయిందని, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించామని, సహాయం పొందాలని తెలిపారు. చెరువుల విషయంలో 669 వాటికి ప్రమాదముందని గుర్తించి గస్తీ ఏర్పాటు, ఇసుక బస్తాల ఏర్పాటు చేశామని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాలువలు, వాగులు , వంకలు దాటరాదని తెలిపారు.