విశాఖజిల్లాలో జగనన్నతోడు 87527 మందికి లబ్ది..
Ens Balu
1
Visakhapatnam
2020-11-25 16:50:39
చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ఎంతో ఉపయోగ పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న తోడు పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు నుండి పట్టణాలు, నగరాలలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులకు ఉపయోగపడుతుందని, కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెళ్ళి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామానులు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఈ పథకం స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు, వార్డుల్లో వార్డు వాలంటీర్లు అర్హులైన లబ్దిదారుల వద్దకు వచ్చి వారినుండి వివరాలు తీసుకొని సచివాలయాల్లో ఉన్న సంక్షేమ అధికారి బ్యాంకు ఖాతాను ఓపెన్ చేస్తారని తెలిపారు. వడ్డీ లేకుండా రూ.10 వేలును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుందని స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్లి జగనన్న తోడు జాబిను పరిశీలించి అందులో మీ పేర్లు లేకపోతే మరో నెల రోజులు సమయంలో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1902 కు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా మంచి జరగాలని కోరుకుంటూ ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 87 వేల 527 మంది లబ్ది పొందుతున్నారని, ఏటికొప్పాకలో 467 మంది శత శాతం లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. జిల్లాలో కూరగాయ వ్యాపారులు, తదితరులు ఎక్కువ మంది లబ్దిపొందుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డితో జగనన్న తోడు లబ్దిదారురాలు భీమిలి నియోజక వర్గం పద్మనాభం మండలానికి చెందిన చుక్కా స్వాతి మాట్లాడుతూ తాను కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నానని, ప్రస్తుతం తాను బయటే కూరగాయలు అమ్ముకొని, రాత్రి కూరగాయలను ఇంటికి తీసుకువెలుతున్నానని, ఒక బడ్డీ తయారు చేసుకొని రాత్రి ఆ బడ్డీలో కూరగాయలు దాచుకొని ఉదయం షాపు తీసుకొని అమ్ముకొనుటకు బ్యాంకుకు వెల్లి ఋణం అడిగితే వారు స్యూరిటీ అడిగారని, ప్రస్తుతం ఋణం ఇస్తాం బ్యాంకుకు రమ్మనమని వారే నాకు ఫోన్ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. మీ పథకాలు ద్వారా నా తల్లికి సున్నా వడ్డీ కింద 18 వేల రూపాయలు, నా బిడ్డ ప్రభుత్వ స్కూల్ చదువుకొంటున్నందుకు 15 వేల రూపాయలు, నా భర్తకు ఆటో నడుపుకుంటున్నందుకు పది వేల రూపాయలు, వై.యస్.ఆర్. ఆసరా కింద 8 వేల 50 రూపాయలు, జగనన్నతోడు పథకం ద్వారా పది వేల రూపాయలు, నాన్నమ్మకు వృద్థాప్య ఫించను, తదితరమైన వాటి ద్వారా ఒక్క నా కుటుంబంలోనే ఒక లక్షా 68 వేల 800 రూపాయలు అందుతుంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నో కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. అనంతరం 87 కోట్ల 53 వేల రూపాయల చెక్కును, గుర్తింపు కార్డులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లబ్దిదారులకు అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జివియంసి కమీషనర్ జి. సృజన, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జె.సి.-3 గోవిందరావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న తోడు పథకం ద్వారా లక్షల మంది లబ్దిదారులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. కూరగాయలు, తోపుడు బళ్లు, చిన్న చిన్న టిఫిన్ షాపులు, పూలు, మోటారు సైకిళ్ళపై వెల్లి వ్యాపారం చేసుకొనే వారు, పళ్లు, కిరాణా, బడ్డీ కొట్టులు, ఫ్యాన్సీ, మగ్గం వర్క్, క్లాత్ అండ్ హేండ్లూమ్స్, లేస్ వర్క్, స్టీల్ షాపులు, కుమ్మరి, కిచెన్ అండ్ ప్లాస్టిక్ సామాలు, బ్యూటీ అండ్ ఫ్యాషన్, బ్రేస్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, లెథర్ పప్పెట్స్, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణా, తదితర వ్యాపారులు జగనన్న తోడు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. చిరు వ్యాపారులు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్లి జగనన్న తోడు జాబిను పరిశీలించి అందులో మీ పేర్లు లేకపోతే మరో నెల రోజులు సమయంలో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.