9మందికి కారుణ్య నియామకాలు..


Ens Balu
3
Anantapur
2020-11-25 16:52:16

అనంతపురం జిల్లాలో కారుణ్య నియామకం కింద తొమ్మిది మంది అభ్యర్థులకు  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్తర్వులు అందచేశారు. వివిధ శాఖల్లో పని చేస్తూ,సర్వీసులో ఉండగానే మరణించిన  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన 9 మంది అభ్యర్థులకు  జూనియర్ అసిస్టెంట్ లుగా నియమించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాల్లోకి చేరిన వారంతా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించడంలో చొరచూపాలని సూచించారు. కారుణ్యనియామకాల ద్వారా ఉద్యోగాలు సత్వరమే వచ్చాయంటే దానికి ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వేగంగా పనిచేయడం వలనే అదిసాధ్యపడిందన్నారు. అదే వేగాన్ని, సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు..ఈ కార్యక్రమంలో డీఆర్వో గాయత్రీ దేవి పాల్గొన్నారు..