చిత్తూరు జిల్లాలో 74,950 మందికి జగనన్నతోడు..


Ens Balu
3
Tirupati
2020-11-25 16:55:26

రాష్ట్ర వ్యాప్తం గా చిరు వ్యాపారుల ఆర్థిక  స్వావలంబనకు  9 లక్షల మందికి పైగా  రూ. 10 వేలు వంతున రూ. 905 కోట్లు జమ చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం  ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం తాడేపల్లి నుండి జగనన్న తోడు ప్రారంభించగా  తిరుపతి నగర పాలక సంస్థ నుండి  డిప్యూటీ సి. ఎమ్.  నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, శాసన సభ్యులు  భూమన కరుణాకర రెడ్డి, ఆదిమూలం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్  రెడ్డి,జిల్లా కలెక్టర్ డా. ఎన్. భరత్ గుప్తా , నగర పాలక సంస్థ కమీషనర్ పి ఎస్ గిరీషా,  అధికారులు పాల్గొన్నారు.             ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ  తన పాద యాత్ర లో చిన్న వ్యాపారస్తుల  ఎండనక, వాననక ఉదయాన్నే 4 గంటలకు తమ జీవనం ప్రారంభించే వారి అవస్థలు చూస్తే వారిని మనం మహనీయులుగా గుర్తించాలని అన్నారు.  వీరు అసంఘటిత   కార్మికులు అయినందున వీరికి బ్యాంకులు లోన్లు ఇవ్వరని 3/5/10 రూపాయలు  ఇలా వడ్డీ కి తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారని  అందుకోసం నేడు కనీసం  10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించి నేడు 9 లక్షల మందికి పైగా రూ. 905 కోట్లు వారి ఖాతాలలోకి జమ చేసి , మరో నెల పాటు  ఇంకా ఎవరికైనా అందకుంటే సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇస్తున్నామని తెలిపి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు.          ఉపముఖమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ  జగనన్న ఆలోచన  పేదవాడిని కోటీశ్వరుడిని చేయడమేనని తెలిపారు.  పేదవాడికి  దేవుడిలా వచ్చి బ్యాంకులకు తాను గ్యారంటీ  ఇచ్చి , వడ్డీ లేకుండా రుణాలు నేడు జిల్లాలో 74,950 మందికి రూ. 10 వేలు వంతున ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు.  ప్రస్తుతం జరుగుతున్న విధానం లో పేదవారు రూ. 10 వేలు తీసుకుంటే  అప్పుడే రూ. 1500 పట్టుకొని రోజు రూ. 100 కట్టమంటుంటారని తెలిపారు.  మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.        జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ  వ్యూ ఆఫ్ టైమ్స్ పత్రికలో ఒకప్పుడు చదవానని చిన్న అతి చిన్న వ్యాపారస్తులను ఆదుకుంటే ఆర్థిక స్వావలంబన, దేశ, రాష్ట్ర అభివృద్ధి వస్తుందని, కానీ ముఖ్యమంత్రి తమ పాద యాత్ర లో వారి స్వయంగా చూసి కష్టాలను గుర్తించి నేడు వారికి ఆర్థికంగా ఆదుకోవడానికి జగనన్న తోడు ప్రవేశ పెట్టారని ఇది ఒక శుభ దినం అని అన్నారు. ఎంతో మంది చిన్న వ్యాపారస్తులకు బ్యాంకులు  షూరిటీ  వుంటేనే రుణం ఇవ్వరని నేడు ముఖ్యమంత్రి హామీ తో బ్యాంకులు ముందుకు వచ్చాయని 10 లక్షల మంది పేదలకు రుణం అందించడం బ్యాంకులకు ధన్యవాదాలను అన్నారు.  తీసుకున్న రుణాన్ని సకాలం లో చెల్లిస్తే , వడ్డీ  ప్రతి 3 నెలలు  ఒకసారి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు.         జిల్లా కలెక్టర్ ముఖ్య మంత్రికి వివరిస్తూ జిల్లా లో జగనన్న తోడు లబ్దిదారుల శాతంలో రాష్ట్రంలో మొదటి స్థానం లో వుందని  నేటికీ 74,950 మంది అర్హత పొందరని  వారికి  రూ. 74 కోట్ల 95 లక్షలు వారి ఖాతాలకు జమ కానున్నదని  తెలిపారు.  జగనన్న తోడు లబ్ది దారులు  శ్యామల ముఖ్య మంత్రి తో తన అభిప్రాయం  వీడియో కాన్ఫెరెన్స్ లో పంచుకుంటు,  సార్, మాది శ్రీకాళ హస్తి  కలంకారీ  పనులు చేసుకుంటాము.  ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తే నెలకు జీతం రూ. 6 వేలు వస్తుందని తెలిపారు.  దీని కోసం  వ్యాపారస్తులు  వడ్డీ రూ. 10 వేలు తీసుకుంటే రూ. 10 వడ్డీ కడుతున్నామని నేడు జగనన్న తోడు రుణం అందడం  సంతోషంగా వుందని తెలిపారు.  ఇప్పటికే లేపాక్షి ద్వారా  ఆన్  లైన్ అమ్మకాలకు  కాలంకారీ కి  అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు.  బ్యాంకులకు  వెళ్తే షూరిటీ కావాలంటారు.  మా అన్నగా నేడు రూ. 10  వేలు షూరీటీ లేకుండా, వడ్డీ లేకుండా ఇస్తున్నారని మీ మేలు  మరవ బొమని,  మళ్ళీ మళ్ళీ మీరే  ముఖ్య మంత్రి గా కావాలని  మహిళలు కోరుకుంటున్నారని  అన్నారు.  సమావేశం అనంతరం రూ. 74,95,000 లక్షల చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ సమావేశం లో జె. సి (డి)  వీరబ్రహ్మం , లీడ్ బ్యాంక్ మేనేజర్ గణపతి, నగర పాలక అడిషనల్ కమీషనర్  హరిత, డిప్యూటీ కమీషనర్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి,   మెప్మా పి డి జ్యోతి , డి ఆర్ డి ఏ పి డి  తులసి, జీవనోపాదుల ఏ పి డి కృష్ణవేణి, బ్యాంక్ లింకేజ్ అధికారి బాబా , అధికారులు వున్నారు.