జర్నలిస్టు ప్రసాద్ లోటు పత్రికారం రంగంలో పూడ్చలేనిది..
Ens Balu
2
విశాఖ పబ్లిక్ లైబ్రెరీ
2020-11-25 17:02:27
విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ అకాల మరణం పత్రికా లోకనికి తీరని లోటని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. బుధవారం పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ముత్యాల ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ సామాజిక స్పృహ ,విలువలు,వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అనేక కధనాలతో కూడిన సంపాదకీయం చేసిన ముత్యాల ప్రసాద్ పలువురికి మార్గదర్శగా నిలిచారని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా తన కధనాలు, వ్యాసాలు, రచనలు ద్వారా ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు.ముత్యాల ప్రసాద్ కుటంబానికి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అసోసియేషన్ తరుపున నివాళులర్పించిన వారిలో ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ,కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.