సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తో జరభద్రం..


Ens Balu
3
Visakhapatnam
2020-11-25 17:43:38

ఆంధ్రప్రదేశ్ లోని సెకెండ్ వేర్ కరోనా వైరస్ విస్తరణ వేగంగా జరుగుతున్నందున ప్రతీఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు కోరారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చలికాలం ప్రారంభమైన వేళ కరోనా వైరస్ కేసులు అధికం అవుతున్నాయని ఈ సమయంలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఖచ్చితంగా మాస్కులు ధరించడంతోపాటు,  సామాజిక దూరం పాటించాలన్నారు. బయటకొచ్చే సమయంలో హేండ్ గ్లౌజులు వేసుకోవాలని సూచించారు. చలికాంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంటుందని ప్రభుత్వం సూచిస్తున్నవేళ ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ నియంత్రణ ఉద్యమంలో బాగస్వాములు కావాలన్నారు. అత్యవసర సమయంలో తప్పా మిగిలిన సందర్భాల్లో ఎవరూ బయటకు రాకూడదని పోలాకి సూచిస్తున్నారు. నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే వినియోగించాలన్నారు. ముఖ్యంగా వ్యాధులు ఉన్నవారిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆశన్నమైందన్నారు. మార్చి వరకూ ప్రభుత్వ సూచనలు పాటిస్తే అప్పటికి కరోనా నియంత్రణతోపాటు, వాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎవరికైనా కరోనాల లక్షణాలుంటే దగ్గర్లోని పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 14 రోజులు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ పాటించాలని పోలాకి శ్రీనివాసరావు మీడియా ముఖంగా కోరారు.