జర్నలిజంలో ప్రత్యేకముద్ర వేసిన ముత్యాల ప్రసాద్‌..


Ens Balu
4
Srikakulam
2020-11-25 17:54:53

తెలుగు జర్నలిజం రంగంతో పాటు భాషా, రచన, అభ్యుదయ రంగాల్లో ముత్యాల ప్రసాద్‌ ‌తనదైన ముద్ర వేసి ఆదర్శనీయంగా నిలిచారని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాలాంధ్ర ఎడిటర్‌ ‌ముత్యాల ప్రసాద్‌ ‌సంతాప సభ బుధవారం శ్రీకాకుళం జిల్లా సిపిఐ శాఖ, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా స్థానిక క్రాంతిభవన్‌లో నిర్వహించాయి. విశాలాంధ్ర దినపత్రిక జిల్లా బ్యూరో ఇన్‌ఛార్జి ఎస్‌.‌రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యమ్రంలో పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొని ప్రసంగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు మాట్లాడుతూ సంపాదకుడిగా ప్రతి ఒక్కరితో ఎంతో సాన్నిహిత్యాన్ని, రచనా అనుబంధాన్ని కలిగిన ముత్యాల అకాల మృతి, విశాలాంధ్ర సభ్యులకు తీరని లోటన్నారు. సామాజిక దృక్ఫథం గల యువ జర్నలిస్టులను తయారు చేయుడంలోనే, విలువల గల జర్నలిజం కొనసాగించడంలోనూ ముత్యాలు చూపిన చొరవ విశాలాంధ్ర ఖ్యాతిని మరింతగా పెంచిందన్నారు. ఆయనతో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌రచయిత బెందాళం కృష్ణారావు మాట్లాడుతూ, మంచి రచయితను, సంపాదకుడిని తెలుగు ప్రజలు కోల్పోయారన్నారు. కోల్పోయారన్నారు. విషయాన్ని లోతుగా ఆలోచించి, దానిపై పరిష్కారయుత విశ్లేషణ చేయడంలో ముత్యాల ముందుండేవారన్నారు. డా.బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌విశ్వవిద్యాలయం జర్నలిజం పీజీ శాఖ అధ్యాపకులు డా.జి.లీలావరప్రసాదరావు మాట్లాడుతూ, జనం నుంచి వచ్చిన నిజమైన సంపాదకుడు ముత్యాల ప్రసాద్‌ అని కొనియాడారు. మూడు దశాబ్ధాల పాటు విశాలాంధ్రలో వివిధ హోదాల్లో సేవలందించి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో ఎంతో ముఖ్యభూమిక పోషించారన్నారు. సమాజానికి కళ్లు, కాళ్లుగా ఉండేటటువంటి సాహితీవేత్తలు, కళాకారులు, పాత్రికేయులు కరోనా బారిన పడి వరుసుగా ఎంతో విచారకరం, దురదృష్టకరమన్నారు. ఏపియూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలోనూ, వారిని సంఘటిత పరచడంలోనూ ముత్యాల ప్రసాద్‌ ‌చేసిన కృషి మరువలేనదన్నారు. సమాజానికి దిశానిర్థేశం చేయడంలో నిరంతరం ముందుండే వారన్నారు. ఏపిడబ్ల్యుజె జిల్లా కార్యదర్శి ఎస్‌. ‌ప్రసాద్‌, ‌పాత్రికేయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఎల్‌.‌రవికుమార్‌ , ‌పాపారావు, మల్లేశ్వరరావు, కృష్ణారావు, డిపి దేవ్‌. ‌కె.భాస్కరరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా, ముత్యాల చిత్రపటానికి ఘననివాళిలు అర్పించి జోహార్లు పలికారు.