గ్రామసచివాలయాల నిర్మాణాలు పూర్తికావాలి..


Ens Balu
2
తిరుపతి
2020-11-25 18:04:26

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మక ఆలోచనతో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయాలు, రైతు బారోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు , పాలసేకరణ కేంద్రాలు, వంటివి గ్రామీణ వాతావరణం,  గ్రామవ్యవస్థను రూపు రేఖలు మార్చే నిర్మాణాలని అని నిర్దేశించిన సమయం  మేరకు  మార్చి 2021 నాటికి పూర్తి కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి  ఆదేశించారు. బుధవారం సాయంత్రం విజయవాడ పంచాయితీ రాజ్ కమిషనరేట్ కార్యలయం నుండి అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించంగా స్థానిక నగరపాల సంస్థ కార్యలయం నుండి ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి , జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వివరిస్తూ  గ్రామ సచివాలయాలు 1012, రైతు భరోసా కేంద్రాలు 932, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్స్ 721, నాడు – నేడు పాటశాలల కాంపౌండ్ పనులు 1318 , వై.ఎస్.ఆర్.ప్రీస్కూల్స్ (అంగన్  వాడీలు) 580 వివిధ స్థాయిలో పురోగతిలో వున్నాయని వివరించారు. గత 3 వారాల్లో నిర్దేశించిన వారానికి రూ.10 కోట్లు ఖర్చు మేరకు ఎక్కువగానే  రూ.10.5 కోట్లు నిధులు ఖర్చు చేశామని తెలిపారు. నరేగాలో రూ. 385 కోట్లు లేబర్ కాంపొనెంట్ ,  మెటీరీయల్ కాంపొనెంట్ రూ 150 కోట్లు  ఖర్చు చేశామని తెలిపారు. గ్రామాల్లో నరేగా అనుసంధాన నిర్మాణాలకే ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. సచివాలయాల స్థలాలు 74 చోట్ల  వివిధ కారణాల వల్ల పెండింగ్ వుంటే గతవారం పరిష్కరించామని  డిసెంబర్ 10 నాటికి అవి కూడా పురోగతిలో వుంటాయని అనుకున్న మేరకు మార్చి 2021 కి పూర్తి చేస్తామని ఇబ్బందులు లేవని వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పిడి డ్వామా చంద్రశేఖర్ , ఎస్.ఇ  లు పి. ఆర్. అమరనాథ్రెడ్డి, ఇరిగేషన్  సురేంద్ర నాధ్, ఆర్. డబ్ల్యూ. ఎస్ విజయ కుమార్ , ఇంజనీరింగ్ శాఖల  ఇ ఇ లు, డి ఇ లు, అధికారులు పాల్గొన్నారు.