శ్రీకాకుళంలో జగనన్నతోడు రూ.42.24 కోట్లు..


Ens Balu
2
Srikakulam
2020-11-25 18:30:06

నిరుపేద చిరు వ్యాపారాలను ఆదుకోవడానికే జగనన్న తోడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్పరెన్సు ద్వారా జగనన్నతోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, నిరుపేద చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తుల వారి ఆర్ధిక సాయం అందించడానికి జగనన్న తోడు కార్యక్రమమని అన్నారు . పాదయాత్రలో చిరువ్యాపారుల ఆర్ధిక కష్టాలను కళ్ళారా చూడడం జరిగిందని, నిరుపేద చిరు వ్యాపారులు ఆర్ధిక స్థోమత లేకపోవడం వలన అధిక వడ్డీలు చెల్లిస్తూ రుణాలను వడ్డీ వ్యాపారుల నుండి తీసుకోవడం జరుగుతున్నదన్నారు.  వారి కష్టాలను చూసి చలించి పోయానని, వారికి మంచి చేయాలనే వుద్దేశ్యంతో  జిల్లా కలెక్టర్లు, జె.సి.లు, బ్యాంకర్లతో మాట్లాడి, వారికి సున్నా వడ్డీకే రుణ సదుపాయాన్ని కలిగించే మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు, కులవృత్తి దారులు, ఫుట్ పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫిన్లు అమ్ముకునే వారికి  పదివేల రూపాయలను వారి ఖాతాలకు వారం పది రోజులలో జమ చేయడం జరుగుతుందని  తెలిపారు.  వారికి ఐడెంటిటీ కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు.  తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించి వచ్చే ఏడాది మరల వడ్డీ లేని రుణాన్ని బ్యాంకు ద్వారా పొందాలని ముఖ్యమంత్రి చెప్పారు.  జగనన్న తోడు ద్వారా  ఇచ్చిన వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి,  వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలనుండి చిరు వ్యాపారులకు విముక్తి కలిగించడం జరుగుతున్నదన్నారు.  శ్రమ అధికం, తక్కువ ఆదాయం వస్తున్నా, మరి కొందరికి ఉపాధి కల్పిస్తూ, సమాజానికి  సేవ చేస్తున్న చిరు వ్యాపారులకు  పెట్టు బడి ఇబ్బందులు తొలగించి, వ్యాపార విస్తరణకు చేయూత నివ్వడం చాలా ఆనందంగా వుందన్నారు.  గ్రామాలలో, పట్టణాలలో వాలంటీర్లు,  వెల్ఫేర్ అసిస్టెంట్లు చిరువ్యాపారులను గుర్తించడం జరిగిందన్నారు. వారికి ఐ.డి.కార్డులను అందించామన్నారు.  ఇంకా ఎవరైనా లబ్దిదారులు మిగిలిపోయి వుంటే వారు తక్షణమే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలన్నారు.  నెల రోజుల గడువును ఇవ్వడం జరిగిందని తెలిపారు.  లబ్దిదారులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది.  బ్యాంకు అధికారులకు సన్మానం చేసారు. జిల్లాలో 42,238 మంది దారులకు 42 కోట్ల ఇరవై నాలుగు లక్షల  రూపాయలను జగన్నతోడు క్రింద మంజూరు చేయడం జరిగింది.  ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె  నివాస్, ఎస్. పి. అమిత్ బర్దర్, డి సి సి బి చైర్మన్ పాలవలస విక్రాంత్,ఎం ఎల్ ఏ కంబాల జోగులు, ,తమ్మినేని చిరంజీవి నాగ్, జె. సి. కె. శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, డి ఆర్ డి ఏ   పి. డి. బి. శాంతి, మెప్మా పి డి కిరణ్ కుమార్, యూనియన్ బ్యాంకు ఎఫ్ బి ఎం. శ్రీనివాస్ శెట్టి, డి జి ఎం. కృష్ణయ్య, ఎల్ డి ఎం హరి ప్రసాద్, ఎస్ బి ఐ  ఆర్. ఎం  ప్రసాద్, ఏ పి జి వీ బి. ఆర్. ఎం. రియాజ్, డి సి సి బి. సి ఈ ఓ సత్యన్నారాయణ, అసిస్టెంట్ ఎల్ డి ఎం. వెంకట రమణ, కెనరా బ్యాంకు మేనేజర్ పులి రూపేష్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.