ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-25 19:20:47

జాతీయ‌ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరామ‌చంద్రారెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల‌కృష్ణ ద్వివేది, క‌మిష‌న‌ర్ ఎం.గిరిజా శంక‌ర్ తో కలసి  జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో బుధ‌వారం మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనుల అనుసంధానంతో జరుగుతున్న ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, మార్చి నెలాఖ‌రు నాటికి రాష్ట్రంలో సుమారు రూ.4 వేల‌ కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయాల‌ని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ  భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీతో అనుసంధానం చేచి చేపడుతున్న పనుల లక్ష్యాలను సాధించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. నిధులను సద్వనియోగం చేసుకొనుటకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, పంచాయతీ రాజ్ ఇన్ ఛార్జ్ పర్యవేక్షక ఇంజనీరు కె.ఎం.వి.ప్రసాద రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.