పారదర్శకంగా పారిశ్రామికాభివ్రుద్ధి..


Ens Balu
2
Tirupati
2020-11-25 20:04:19

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి  పారదర్శకంగా  పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నారని  జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.  ఏ. పి. ఐ. ఐ. సి. కోసల నగరం ఎం. ఎస్. ఎం. ఈ. పార్కులో పారిశ్రామిక వేత్తలకు కేటాయింపు  పై స్థానిక  తాజ్ హోటల్  నందు ఏ పి ఐ ఐ సి ఛైర్మన్ రోజా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, ఏ  పి ఐ ఐ సి  అధికారులతో, పారిశ్రామిక వేత్తలతో కేటాయింపు, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సమీక్ష వర్చువల్ విధానం లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ,  విజయ పురం మండలం లోని కోసల నగరం  ఎం. ఎస్. ఎం. ఈ. పార్కు 2000 ఎకరాలలో విస్తరించి వున్నదని,  దీనిని  న్యూ గ్రీన్ ఫీల్డ్  ఎం. ఎస్. ఎం. ఈ.  గా రూపు దిద్దుకున్నదని అన్నారు. ముఖ్యమంత్రి  పారిశ్రామిక పెట్టుబడులకు ప్రాధాన్యత నిస్తున్నారని  ఈ పార్కులో వసతుల  కల్పన త్వరగా  పూర్తి చేయాలని కోరారు. “ఐమా " అంబత్తూరు ఇండస్ట్రియల్ అశోషియేషన్   ప్రతినిధులు  750 ఎకరాలు కోరారని త్వరగా  వసతులు కల్పించాలని ఎ. పి. ఐ.  సి. సి.  అధికారులు సూచించారు.  నేడు కోసల నగరం పార్కు వద్దే జరగాల్సిన సమావేశం వర్షాల  కారణంగా  ఇక్కడ జరుపుతున్నామని మరో నెల  లోపు  కేటాయింపుతో  ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎం. ఓ. యు. లు కుదుర్చుకోవాలని  "ఐమా "  ప్రతినిధులకు సూచించారు. ఎ పి ఐ సి సి ఛైర్మన్ రోజా మాట్లాడుతూ ముఖ్య మంత్రి సులభతర పారిశ్రామిక పెట్టుబడులు  ప్రోత్సహించి ఇస్తున్నారని, నగరి ప్రాంతం  ప్రస్తుతం పవర్ లూమ్ పరిశ్రమకే  పరిమితమైందని అన్నారు.  నగరి నియోజక వర్గం లో మంచి ఇండస్ట్రియల్ పార్కు రానున్నదని, తమిళనాడు సరిహద్దుల దృష్ట్యా పారిశ్రామిక వేత్తలు సమ్మతి తో వున్నారని త్వరలో నగరిలో ఇతర పరిశ్రమలకు కూడా నాంది పలకనున్నామని తెలిపారు.    ఈ ముఖాముఖి కార్యక్రమంలో వర్చువల్ ద్వారా ఇండస్ట్రియల్  స్పెషల్ చీఫ్  సెక్రెటరీ శ్రీ కరికాల వేలవన్ పాల్గొనగా సమీక్ష లో ఇండస్ట్రియల్ డైరెక్టర్ సుబ్రమణ్యం, ఐ. ఎ. ఎస్ , ఎం. డి.  రవీన్ కుమార్ రెడ్డి,  చిత్తూరు ఆర్. డి. ఓ. రేణుక, ఎ పి ఐ ఐ సి  ఇ. డి. ప్రతాప రెడ్డి, జోనల్ మేనేజర్ ఎల్ రామ్, డిఐసి జనరల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి అంబత్తూర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ , తదితరులు పాల్గొన్నారు.