నెట్ షెడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారుచేయాలి..


Ens Balu
2
Arilova
2020-11-25 20:27:56

విశాఖలోని ఆరిలోవ నైట్ షెల్టర్ల రేకుల షెడ్డులు కారిపోతున్నందున వాటిని తొలగించి ఆ స్థానంలో స్లాబ్ వేయుటకు అంచనాలు తయారుచేయాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జివిఎంసి పరిధిలోని జోన్-1లో జివిఎంసి కమిషనర్ నైట్ షెల్టర్లకు కావలిసిన మౌళిక వసతులను పరిశీలించారు. అనంతరం మధురవాడ కారు షెడ్ నుంచి మారికవలస వరకు రహదారి విభాగినులపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, మెట్రో పనులు  ప్రారంభమైతే వాటిని తొలిగించి, వేరే చోట ఉపయోగించేలా ఏర్పాటుచేయాలన్నారు. బింద్రానగర్ 60అడుగుల రోడ్డు, ఎండాడ నుండి గీతం కాలేజ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపెడుతున్న నేపద్యంలో, ఆ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయే వారికి టి.డి.ఆర్.లు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. రుషికొండ నుండి ఐ.టి.సెజ్ వరకు రోడ్డు విస్తరణ పనులకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వాంబే కోలనీలోని ఏ1 బ్లాకు నుండి ఏ47 బ్లాకు వరకు బి1 బ్లాకు నుండి బి47 బ్లాకు వరకు మొత్తం 97 బ్లాకులకు సంబందించి భూగర్భ మురుగు నీటి వ్యవస్థను మెరుగు పరిచే పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. స్థానిక ప్రజలతో మాట్లాడి మౌళిక వసతులపై ఆరా తీసారు. ఇంకా పునరుద్ధరించని యు.జి.డి. కనక్షనులను తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. ఎండాడలో శిధిల స్థితిలో ఉన్న రిజర్వాయర్ ను  తొలగించి, 2000కి.లీల రిజర్వాయరు నిర్మాణానికి  అంచనాలను తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, డి.సి.పి. రాంబాబు, పర్యవేక్షక ఇంజినీర్లు  శివప్రసాద రాజు, వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీర్లు సుధాకర్, నరసింహ తదితరులు పాల్గోన్నారు.