పేర్ని నానిని పరామర్శించిన డిప్యూటీసీఎం
Ens Balu
2
Machilipatnam
2020-11-26 10:24:52
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారి మాతృమూర్తి స్వర్గీయ పేర్ని నాగేశ్వరమ్మ కి డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్, మంత్రి చెల్లుబోయినవేణులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రివర్యులు చెల్లుబోయిన వేణులు పేర్నినానితో కొంతసేపు మాట్లాడారు. ఇలాంటి సమయంలోనే మనసు దిటవు చేసుకోవాలని పేర్నిని సముదాయించారు. తల్లిని కోల్పోవడమంటే ఇంటిపెద్దను కోల్పోవడమేనని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.అనంతరం పలు అంశాలు పేర్నితో చర్చించారు. గత మూడు రోజులు పేర్ని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు పరామర్శిస్తూనే వున్నారు.