చిత్తూరుజిల్లాలో విద్యాలయాలకు సెలవు..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-26 11:05:48
చిత్తూరు జిల్లాలో నేడు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసిన కారణంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల లకు మరియు విశ్వ విద్యాలయాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటన లో తెలిపారు. వర్షాలు అధికంగా వున్నందున ఎవరూ బయటకు రాకూడదని కోరారు. వర్షాలు పడుతున్నంతసేపు కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. ఎవరికైనా జ్వరాలు వస్తే దగ్గర్లోని గ్రామ వాలంటీరు ద్వారా సచివాలయ ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి మందులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ప్రజలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.