శ్రీకాలహస్తిలో పోలీసుల సహాయక చర్యలు..


Ens Balu
2
Srikalahasti
2020-11-26 12:35:26

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గురువారం శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజలకు సూచనలు జారీచేస్తున్నారు. వర్షాల కారణంగా స్వర్ణముఖి నది లో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని పిల్లలను బయటకు పంపొద్దని చెబుతున్నారు.  ఈ సందర్భంగా  సి.ఐ నాగార్జున రెడ్డి వారి సిబ్బందితో అన్ని ప్రాంతాలను తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పడిపోయిన చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్న పిడుగులు, చెట్లు పడిపోయే అవకాశం వుందని ప్రజలు చెట్లు ఉన్న చోట వాటిదగ్గరకు వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.