రహదారిపై నేలకొరిగిన చెట్లను తొలగించిన పోలీసులు..
Ens Balu
3
తొట్టంబేడు
2020-11-26 12:37:29
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు గురువారం సహాయక చర్యలు చేపట్టారు. భారీ గాలులు, వర్షాలు పడిన ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లను తొలగింపు చేపట్టారు. తొట్టంబేడు పోలీస్ సిబ్బంది శ్రీకాళహస్తి తొట్టంబేడు, తంగెళ్ళ పాల్యెం, కొలత్తూరు రోడ్డు నివర్ తుఫాన్ ధాటికి రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగి రహదారి మొత్తం దిగ్బంధం జరిగినది. దీంతో ప్రజలు రాకపోకలు స్తంబించాడంతో సమాచారం అందుకున్న తొట్టంబేడు పోలీస్ సిబ్బంది ఉంటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఏ ఇబ్బంది లేకుండా చేశారు. అదేసమయంలో ఆ ప్రాంత వాసులను కూడా భారీ వర్షాల్లో జరిగే అనర్ధాలపై అప్రమత్తం చేశారు.