జెఎన్టీయూకేలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..


Ens Balu
5
Kakinada
2020-11-26 16:04:43

ప్రతీ ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన పెంచుకుని ఇతరులకు కూడా రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరించాలని జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు పిలుపునిచ్చారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను యూనివర్శిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సెంట్రల్‌ ‌లైబ్రరీ హాలులో కోవిడ్‌-19 ‌నిబంధనలను అనుసరిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు మాట్లాడుతూ, డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌రచించిచ రాజ్యాంగం భారతదేశంలో అమలైన నవంబర్‌ 26‌వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగ పితగా డా.బిఆర్‌.అం‌బేద్కర్‌ ‌చరిత్రలో నిలిచిపోయారని, భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగ గ్రంథంగా నిలిచిందన్నారు. ప్రతీ ఒక్కరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకుని తద్వారా సమాజాభివృద్ధి తమ వంతు కృషి చేయాలన్నారు. అనంతరం ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రతీ ఒక్కరి చేత చదివించి భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ‌ప్రొ.సిహెచ్‌.‌సత్యనారాయణ, ఓఎస్‌డి ప్రొ.వి.రవీంద్రనాధ్‌, ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌ప్రొ.జి.ఏసురత్నం, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ‌ప్రొ.బి.బాలకృష్ణ, గ్రీన్‌ ‌క్యాంపస్‌ ఇనీషియేటివ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.కె.వి.ఎస్‌.‌జి.మురళీకృష్ణ, ఉమెన్‌ ఎం‌పవర్‌మెంట్‌ & ‌గ్రీవెన్సెస్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.స్వర్ణకుమారి, ఐఐఐపిటి డైరెక్టర్‌ ‌ప్రొ.ఎన్‌.‌మోహన్‌రావు, స్కూల్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌స్టడీస్‌ (ఎస్‌ఎంఎస్‌) ‌డైరెక్టర్‌ ‌ప్రొ.ఏ.కృష్ణమోహన్‌, ఇం‌టర్నల్‌ ‌క్వాలిటీ అస్యూరెన్స్ ‌సెల్‌ (ఐక్యూఏసి) డైరెక్టర్‌ ‌ప్రొ.ఎన్‌.‌బాలాజీ, టీచింగ్‌ & ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.