రాజ్యాంగ పరిరక్షణ మన బాధ్యత..
Ens Balu
3
Srikakulam
2020-11-26 16:09:39
శ్రీకాకుళం రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో 71వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి జె.సి. ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని తెలిపారు. ఇందులో ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పొందుపరచడం జరిగిందన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలను తెలియచేసారు. విభిన్న మతాలు, భాషలు, విభిన్న సంస్కృతులతో విలసిల్లే దేశానికి రాజ్యాంగం దిక్సూచి వంటిదని తెలిపారు. రాజ్యాంగ రూపశిల్పి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఈ సందర్భంగా స్మరించుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, హార్టికల్చర్ ఎ.డి.సాల్మన్ రాజు, కలెక్టరేట్ ఎ.ఓ. బి.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.