ఆదిత్యుడిని దర్శించుకున్న డీజిఎం..


Ens Balu
1
Srikakulam
2020-11-26 16:22:30

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) విశాఖపట్నం మాడ్యూల్ డిప్యూటి జనరల్ మేనేజర్ (డిజిఎం) కె.రంగరాజన్ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేదమంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. అనివెట్టి మండపంలో స్వామి వారి ఆశీర్వచనాలను అందించారు. జిల్లావాసులు సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి ప్రభావానికి లోనుకాకుండా ఆరోగ్యంగా ఉండాలని రంగరాజన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జిల్లాలో ఎస్.బి.ఐ ఖాతాదారులకు మంచే సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు సేవలు అందుతున్న తీరును పరిశీలించుటకు జిల్లా పర్యటనకు విచ్చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ.వి.ఎస్.ఎస్.ప్రసాద్, బ్యాంకు సిబ్బంది కిరణ్ బాబు, ఎస్.బి.ఐ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.