ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత్ దే..


Ens Balu
2
Vizianagaram
2020-11-26 17:14:54

ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పెట్టని కోటని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  అభివర్ణించారు . నవంబర్ 26 దేశ చరిత్ర లోనే అద్భుతమైన ఘట్టమని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ను  గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యమని పేర్కొన్నారు.  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి  పూల మలాంకరణ గావించి నివాళు లర్పించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  కేంద్ర ప్రబుత్వ ఆదేశాలు మేరకు నవంబర్ 26న  సంవిధాన్ దివా స్ (రాజ్యాంగ దినోత్సవం) జరుపుతున్నామని, ఇదే రోజున  జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషమని న్నారు. 1949 , నవంబర్ 26 న రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ లో అంగీకారం లభించిందని, 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులొకి వచ్చిందని పేర్కొన్నారు. 70 ఏళ్ళు గడిచినా  మన రాజ్యాంగం చెక్కు చెదరకుండా  ఉంటూ,  ప్రజలంతా స్వేచ్చ, సమానత్వాలను అనుభవిస్తున్నారంటే  అది మన రాజ్యాంగం గోప్పతనమేనని అన్నారు.  ఇలాంటి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం అవసరమని, అన్నారు. జాతీయ పండుగలు జరుపుకోవడం వలనజాతి సమైఖ్యత, ఐకమత్యం వర్దిల్లుతాయని  అన్నారు.   ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమర్  భారత రాజ్యాంగం లోని  ప్రియాంబుల్(పీఠిక)  ను చదివి  సభలో హాజరైన  వారితో ప్రతిజ్ఞ చేయించారు.   ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ (ఆసరా) స్వాగతం పలుకగా జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  జిల్లా పరిశాత్చి.ఈ.ఓ వెంకటేశ్వర రావు,  విజనగరం కార్పొరేషన్  కమీషనర్ ఎస్.ఎస్.వర్మ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవి, ఐ.సి.డి.ఎస్. ఫై.డి రాజేశ్వరి,  పలువురు జిల్లా అధికారులు , కల్లెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.