రాజ్యాంగమే దేశానికి రక్ష..
Ens Balu
1
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 17:36:20
రాజ్యాంగమే దేశానికి రక్షణగా నిలుస్తోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఏయూలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పరిపాలనా భవనం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి, న్యాయ కళాశాల వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం న్యాయ కళాశాలలో ఆచార్యులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. సుస్తిర రాజ్యాంగం భార్‌తదేశానికి ప్రత్యేకమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలను పరిరక్షించే విధంగా పౌరులు నడచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, కె.శ్రీనివాస రావు, పి.రాజేంద్ర కర్మాకర్, ఎస్.సుమిత్ర, పి.రాజేంద్ర ప్రసాద్, ఆర్.శివ ప్రసాద్, ఆచార్య కె.వెంకట రావు, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, జేమ్స్ స్టీఫెన్, ఎస్సీ,ఎస్టీ, బిసి సి ఉద్యోగుల సంఘం అద్యక్షులు పి.అర్జున్, డీన్ డాక్టర్ టి.షారోన్ రాజు, డీన్‌లు, అధికారులు, ఉద్యోగులు, పరిశోధకులు పాల్గొన్నారు.