రిజిస్ట్రార్‌గా ఆచార్య క్రిష్ణమోహన్ ..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 17:40:53
ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య వి.క్రిష్ణమోహన్ గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఈ సందర్భం ఆయనకు ఉత్తర్వులను అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవరం రోజున ప్రఖ్యాత ఆంధ్రాయూనివర్శిటీలో రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించడం మరపురాని అంశమన్నారు. విద్యార్ధులకు, అద్యాపకులకు తనవంతు సేవలందిస్తానని ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మీడియాకి తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విభాగంలోని సిబ్బందిని రిజిస్ట్రార్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.