విసీ ప్రసాదరెడ్డికి అభినందనల వెల్లువ..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 17:47:06
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని గురువారం పలువురు అభినందించారు. పెద్దసంఖ్యలో ఆచార్యులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ ఇయూ నాయకులు వీసీని సత్కరించారు. ఆటా సభ్యులు ఆచార్య ప్రసాద రెడ్డికి శుభాకాంక్షలు అందజేశారు. ఉదయం నుంచి వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. వర్సిటీకి ఉపకులపతిగా ఆచార్య ప్రసాద రెడ్డిని నియమించడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఆచార్యులు వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ఏయూలోని మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వీసీ ప్రసాద రెడ్డిని రెక్టార్ ఆచార్య కె.సమత, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, జేమ్స్ స్టీఫెన్, క్రిష్ణమంజరి పవార్, డీన్‌లు ఆచార్య కె.వెంకట రావు, టి.షారోన్ రాజు, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, అధికారులు తదితరులు అభినందించారు.