భీమిలి చేపలమార్కెట్ కు నూతన భవనాలు..


Ens Balu
2
Bheemili
2020-11-26 18:50:49

భీమునిపట్నం చేపల మార్కెట్ కు నూతన భవన సముదాయాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె భీమునిపట్నం జోన్ లో పర్యటించారు.  పెద్ద బజారు వద్ద ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి చేపల మార్కెట్ ను, షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు.  షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా శిధిలావస్థకు చేరినందున వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టడానికి అంచనాలు తయారు చేయాలన్నారు. తద్వారా ఇక్కడి మత్స్యకారులకు సౌకర్యంగా వుంటుందన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని చెత్త అధికంగా ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, వ్యాధులు ప్రభలకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవింద రావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు, టి.పి.ఆర్.ఓ, శానిటరీ ఇన్ స్పెక్టర్, సచివాలయ కార్యదర్శులు  తదితరులు పాల్గోన్నారు.