ఆస్థిపన్నుల లక్ష్యాలను అదిగమించాలి..


Ens Balu
5
Bheemili
2020-11-26 18:52:12

భీమిలి జోన్ లోని అన్ని వార్డు సచివాలయాల్లోనూ ఆస్థిపన్ను లక్ష్యాలను కార్యదర్శిలు అదిగమించాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. గురువారం అప్పికొండ వీధి సచివాలయంను సందర్శించి వార్డు కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, ఆయా కార్యదర్శుల పని తీరును అడిగి తెలుసికున్నారు. వార్డు పరిధిలో ఎన్ని ఆస్తి పన్నులు వున్నాయి? నీటి కొళాయిలు ఎన్ని వున్నాయి? కొళాయిలు లేని ఇళ్ళకు కొళాయి కనక్షనులు ఇవ్వడానికి చర్యలు తీసుకొన్నారా? లేదా? అని అడిగారు. సచివాలయ పరిధిలోని జనాభా, విద్యార్ధుల వివరాలు పూర్తిగా సేకరించవలసినదిగా సూచించారు. డైరీ, హాజరు, మూమెంట్ రిజిస్టర్ మొదలైన రికార్డులను పరిశీలించి సంక్షేమ పధకాల కొరకు ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు. జివిఎంసి పండిట్ నెహ్రూ మున్సిపల్ హై స్కూలు లో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుచున్న పనులను పరిశీలించి, పనులు సక్రమంగా జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను, స్కూళ్ళ కమిటీ చైర్మన్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవింద రావు, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు, టి.పి.ఆర్.ఓ, శానిటరీ ఇన్ స్పెక్టర్, సచివాలయ కార్యదర్శులు  తదితరులు పాల్గోన్నారు.