ఏయూ విసి ప్రసాదరెడ్డి కి విజెఎఫ్ ఘన సత్కారం..


Ens Balu
1
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 19:00:22

ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఆంధ్రయూనివర్సిటీ ని అందరి సహకారంతో  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయగలిగామని ఆచార్య పీవీజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయూ వీసీగా ప్రసాదరెడ్డిని ప్రభుత్వం నియమించిన తరుణంలో గురువారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విజెఎఫ్  అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు విసి ప్రసాద్ రెడ్డిని  ఘనంగా సత్కరించి, సింహాద్రి అప్పన్న చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్శిటీ అభివృద్ధి లో  ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అదే సమయంలో అనేక నూతన పరిశోధనలకు అవకాశం కల్పించారని విద్యార్థులకు  అవసరమైన అధ్యాపకులను  నియమించడం లో ప్రసాద్ రెడ్డి కృషి ప్రశంసనీయమన్నారు.  ఉపాధ్యక్షులు అర్.నాగరాజు పట్నాయక్, జీవీఎంసీ  గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఆనందరావు ప్రసాద్ లు విసిని కలిసిన వారిలో వున్నారు.