ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవం..


Ens Balu
3
Srikakulam
2020-11-26 19:10:36

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని జిల్లా కోర్టు ఆవరణలోగల బార్ అసోసియేషన్ హాల్ లో గురువారం ఘనంగా జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతోందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం రచించి అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరే విధంగా పొందుపర్చారని పేర్కొన్నారు.  దేశంలో సామాజిక, ఆర్ధిక సమానత్వం వరకు జీవిత చరమాంకం వరకు ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిస్టు రమేష్ అధ్యక్షతన జరిగిన న్యాయ దినోత్సవంలో  ఫామిలీ కోర్టు న్యాయమూర్తి పి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్ సీనియర్ జడ్జి కె.నాగమణి, పెర్మనెంట్ లోక్ అదాలత్ అధ్యక్షులు బి.సత్యనారాయణ, న్యాయ అధికారులు శ్రీలక్ష్మి, కె.రాణి, జి.లెనిన్ బాబు, జె కిషోర్, కె.జయలక్ష్మి, న్యాయవాదులు వానకృష్ణ చంద్, జల్లు తిరుపతిరావు, ఎన్ని సూర్యారావు, బి మురళీకృష్ణ, ఏ కృష్ణరాజు, పిట్టా దామోదరరావు, కూన అన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.