యాంత్రీకరణపై ద్రుష్టిపెట్టాలి..
Ens Balu
2
వాకలవలస
2020-11-26 19:45:20
వ్యవసాయ యాంత్రీకరణ పై రైతులు దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.యస్.నాగిరెడ్డి అన్నారు. గురువారం శ్రీవరి సాగు పై క్షేత్ర సందర్శన మరియు క్షేత్ర దినోత్సవం సందర్భం గా వాకలవలస పైడి వరహా నరసింహ క్షేత్రం లో ఆత్మ పధకం, వ్యవసాయ శాఖ సమన్వయం తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ విస్తరణ అధికారులు ఉన్నారని వారి సేవలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. స్థానిక రైతులు మాట్లాడుతూ, నాణ్యమైన ఎరువులు వాడటం వల్ల వరి దిగుబడి అధికం గా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ మెంబర్లు గొండు రఘురాం, డా:కె.చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు,జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, ఆత్మ పథక సంచాలకులు కె.కృష్ణారావు,కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా: డి. చిన్నం నాయుడు, ఏరువాక కేంద్ర సమన్వయకర్త డా: పి. వెంకటరావు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డా:పి.అమరజ్యోతి, డా:కె.భాగ్యలక్ష్మి, డా:యస్.నీలవేణి, డా:చిట్టిబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు.