నగరంలో పందులు కనిపించకూడదు..


Ens Balu
2
జివిఎంసీ కార్యాలయం
2020-11-26 19:55:53

మహావిశాఖనగర పరిధిలో 10రోజుల్లో పందులను నియంత్రించాలని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. జివిఎంసీ పరిధిలో పందుల సంచారంపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు, పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశాల ప్రకారం జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు పందుల పెంపకం దారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరం పరిధిలో అన్ని ప్రాంతాలలో గల ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందున 10రోజులలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పందులను నిర్మూలించాలన్నారు. వాటికి ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని పెంపకం దారులను కోరారు. లేదంటే చట్టబద్దమైన చర్యలు పెంపకదారులపై చేపడతామని హెచ్చరించారు.  జివిఎంసి. చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్./వెటర్నరీ అధికారి డా. జయరాం పందుల పెంపకం దారులకు పందుల నిర్మూలన విషయమై ఎలాంటి చర్యలు చేపట్టాలో తగు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్. / వెటర్నరీ అధికారి డా. జయరాం, వెటరినరీ విభాగ సిబ్బంది మరియు పందుల పెంపకం దారులు తదితరులు పాల్గోన్నారు.