జిల్లాకి మంచి సేవలందించారు..


Ens Balu
2
Srikakulam
2020-11-26 20:02:05

శ్రీకాకుళం జిల్లాకు మంచి సేవలను అందించారని మార్పు, నాడు-నేడు సమన్వయ అధికారి పి.రజనీకాంతారావు పేర్కొన్నారు.  గురువారం జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ సమావేశ మందిరంలో ఇటీవల పదవీవిరమణ పొందిన ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి, బదిలీపై వెళ్తున్న జిల్లా ఖజానాధికారి జి.నిర్మలమ్మ ,సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు  కె.ఆదిత్యలక్ష్మిలకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మార్పు, నాడు-నేడు సమన్వయ అధికారి పి.రజనీకాంతారావు, విశిష్ట అతిధిగా జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్.మహాలక్ష్మి మంచి సేవలను అందించి, ఆవిడ పదవికి వన్నె తెచ్చారని తెలిపారు. పెను సవాళ్ళను సైతం చాకచక్యంతో ఎదుర్కొనే వారని, అందరితో ఆత్మీయతా భావంతోను, మంచి స్నేహశీలతతోను మెలిగే వారని కొనయాడారు.  అదే విధంగా బదిలీపై వెళ్తున్న ఆదిత్యలక్ష్మి, నిర్మలమ్మ, అందించిన సేవలను గుర్తుచేసారు.  అనంతరం డి.ఆర్.ఓ దయానిధి మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు మంచి నిబధ్ధతతో పనిచేస్తారని తెలిపారు.  వారికి సమాజంలో మంచి గౌరవం వుంటుందన్నారు  మహ లక్ష్మితో పాటు ఆదిత్యలక్ష్మి విమర్శలకు తావు లేని విధంగా విధులను నిర్వర్తించారన్నారు.  విశాఖపట్నం వుడా ఛీఫ్ అక్కొంట్స్ అధికారిగా వెళ్తున్న నిర్మలమ్మ, అక్కౌంట్సుపై మంచి నాలెడ్జ్ వున్న వ్యక్తిగానే కాకుండా మంచి సోషల్ సర్వీసు చేస్తారని తెలిపారు. మన జిల్లా నుంచి ఇతర జిల్లాలలో మంచి సేవలను అందించి జిల్లా పేరు నిలపాలన్నారు.  కార్యక్రమాన్ని హాండ్లూమ్స్ ఎ.డి. వి.పద్మ, గురుకుల పాఠశాలల సమన్వయ అధికారి యశోద లక్ష్మి నిర్వహించారు.  అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది.  సన్మాన గ్రహీతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో సి.పి.ఓ. ఎం.మోహన్ రావు , ఎ.పి.ఎం.ఐ.పి. పి.డి. జమదగ్ని , సెరికల్చర్ ఎ.డి.సార్మన్ రాజు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎ.డి.  జీవన్ బాబు, సెట్ శ్రీ సిఇఓ  శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుజాత, శైలజ, తులాల సవరమ్మ,  నరసన్నపేట కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ఫ్రెడరిక్, , ఛీఫ్ కోచ్ శ్రీనవాస్ కుమార్,.టూరిజం అధికారి నారాయణ రావు, మెప్మా పి.డి. కిరణ్ కుమార్,  ఎ.టి.ఓ.లు సావిత్రి, తవిటన్న, లాయర్ సుధారాణి, డివిజనల్ పౌర సంబంధాల అధికారి లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.