66 మందికి నియామ పత్రాలు అందజేత..
Ens Balu
1
కలెక్టరేట్
2020-11-26 20:04:29
ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురువారం తన ఛాంబర్లో నియామక పత్రాలు అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు 26 మంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు 40 మంది నియామక పత్రాలు స్వీకరించారు. ప్రతీ ఒక్కరూ మంచి పని తీరు కనబరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, వ్యక్తిగతంగా వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అభ్యర్థులను ఈ సందర్భంగా అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఉప సంచాలకులు సునీల్ రాజ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.