ఏయూ విసీ ప్రసాదరెడ్డికి వంశీ ఘనసత్కారం..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-26 20:23:46
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని గురువారం విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులతో వచ్చి వంశీ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, మంచి విద్యావేత్తను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విసిగా నియమించడం అభినందనీయమన్నారు. వర్శిటీ అభివ్రుద్ధికి తమవంతు సహకారం అందిస్తామని విసికి తెలియజేశారు. ఉదయం నుంచి వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. వర్సిటీకి ఉపకులపతిగా ఆచార్య ప్రసాద రెడ్డిని నియమించడంతో పెద్దసంఖ్యలో వివిధ వార్గాల ప్రజలు, పార్టీ నాయకులు వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ఏయూలోని మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.