తరుముకొస్తున్న మరో రెండు తుపాన్లు..
Ens Balu
3
Visakhapatnam
2020-11-27 14:20:47
విశాఖలోని బంగాళాఖాతంలో ఈనెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. డిసెంబర్ నెలలో మరో 2 తుపాన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. డిసెంబర్2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను ముందస్తుగా హెచ్చరించి ఎలాంటి సందర్భమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవిధంగా రాష్ట్ర అధికారులు మౌకిక ఆదేశాల జారీచేశారు..