ఖైదీల జీవితాల్లో కొత్తవెలుగులు..


Ens Balu
2
Rajahmundry
2020-11-27 14:29:15

జైలు సంస్కరణలలో భాగంగా  పలు అంశాల్లో శిక్షణ పొందిన ఖైదీలు బయట ప్రపంచంలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని  భరత్ రామ్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న చారిత్రక నిర్ణయం లో భాగంగా రాష్ట్రంలో మొదటి సారిగా విడుదలవుతున్న మహిళా జీవిత ఖైదీలకు బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎంపీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుతూ స్వాగతం పలికారు. గవర్నర్ ఆమోదంతో  ముఖ్యమంత్రి  ఇంటికి దీపం ఇల్లాలే అని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే మహిళలు సంస్థ ద్వారా కుటుంబానికి చేరువ కావాలని కోరుతూ తీసుకొన్న నిర్ణయం లో భాగంగా మొట్టమొదటిసారిగా మహిళా జీవిత ఖైదీల జీవిత శిక్ష నుంచి ఐదేళ్ల కు తగ్గించి క్షమాభిక్ష రాష్ట్రవ్యాప్తంగా సుమారు 53 మందిని విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలియజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉన్న సెంట్రల్ జైలు నుంచి19 మంది మహిళా జీవిత ఖైదీలు ముఖ్యమంత్రి జగన్ కృషితో విడుదల కాగా ఎంపీ భరత్ రామ్ తరఫున నిత్యవసర వస్తువులు, ప్రయాణ ఛార్జీలు,కొత్త దుస్తులను మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు చందన నాగేశ్వర్, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి  కానుబోయిన సాగర్,  మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, వై ఎస్ ఆర్ సి పి  బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, మారిసెట్టి వెంకటేశ్వరరావు, కొంచ సత్య తదితరులు పంపిణీ చేశారు. ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు, చీరలు పం పిణీ చేసినందుకు మహిళా సెంట్రల్ జైలు సూపరంటెండెంట్ కృష్ణ వేణి, సెంట్రల్ జైలు సూపర్ రిండెంట్ రాజారావు ఎంపీ భరత్ రామ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.