ఉపా చట్టం కేసులు ఎత్తివేయాలి..
Ens Balu
1
Jagadamba Junction
2020-11-27 14:46:06
పౌరహక్కులు, కొన్ని ప్రజాసంఘాల నాయకులపై ఉపా చట్టం ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని సిపిఎం కార్యదర్శి గంగారావు ఆరోపించారు. విశాఖలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదకరమైన ఉపా కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరంకుశత్వ కేంద్ర బిజెపి చర్యలను సిపిఐ(ఎం) గ్రేటర్ విశాఖ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మానవ హక్కుల వేదిక నాయకులు వీఎస్ కృష్ణ, అడ్డకేట్ కె.ఎస్.చలం, పద్మ ఇతర అనేక మందిపై మావోయిస్టులతో సంబంధాలను ఉన్నాయనే ఆరోపణలు చేస్తూ ఈ నెల 23,24 తేదీలలో విశాఖ జిల్లా ముంచింగుపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాల్లలో ఉప చట్టం క్రింద అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. కేంద్ర బిజెపి ఒక కుట్రతో నిరంకుశ చట్టాలు బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడే వారిపై బనాయిస్తున్నదన్నారు. రాష్టప్రభుత్వం కూడా కేంద్ర బిజెపికి తలొగ్గి ఈ చర్యలకు పాల్పడటాన్ని ప్రజలు ఖండించాలని సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేశారు.