కోవిడ్ 19 రోగులకు జిల్లాలో బెడ్ల కొరతలేదు..కలెక్టర్
Ens Balu
2
Srikakulam
2020-07-29 21:13:36
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ భారీన పడిన వారికి పూర్తి స్ధాయిలో చికిత్స అందించుటకు ఆసుపత్రులను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే ఆస్పత్రిలో వచ్చి చేరవచ్చని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో సరిపడా బెడ్స్ లభ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో 121 ఐసియూ బెడ్లు, 1354 ఆక్సిజన్ కలిగిన నాన్ ఐసియు బెడ్ లు ఉన్నాయని, సాధారణ బెడ్లు 3,525 బెడ్లు వెరశి జిల్లాలో ఐదువేల బెడ్లు ఉన్నాయని చెప్పారు. జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 50 ఐసియు బెడ్లు, ఆక్సిజన్ కలిగిన 8 వందల బెడ్లు ఉండగా, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 5 ఐసియు, ఆక్సిజన్ కలిగిన 5 నాన్ ఐసియు, సాధారణ బెడ్లు 50 వెరశి 105 బెడ్లు., గొలివి ఆసుపత్రిలో 10 ఐసియు, 10 ఆక్సిజన్ బెడ్లు, 40 సాధారణ బెడ్లు వెరశి 60 బెడ్లు., రిమ్స్ ఆస్పత్రిలో 40 ఐసియు, 470 ఆక్సిజన్ కలిగిన నాన్ ఐసియు, 40 సాధారణ బెడ్లు వెరశి 550 బెడ్లు., పివీఎస్ రామ్మోహన్ హాస్పిటల్లో 6 ఐసియు బెడ్లు, 25 సాధారణ బెడ్లు వెరశి 31 బెడ్లు., అమృత ఆస్పత్రిలో 10 ఐసియు బెడ్లు, 4 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 40 సాధారణ బెడ్లు వెరశి 54 బెడ్లు., శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కోవిడ్ కేర్ కేంద్రంలో 150, టి డ్ కో కోవిడ్ కేర్ కేంద్రంలో 2000, సంతబొమ్మాలి కోవిడ్ కేర్ కేంద్రంలో 1000 బెడ్లు, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90 సాధారణ బెడ్లు వెరశి 100 బెడ్లు., రాజం ఏరియా హాస్పిటల్ లో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90 సాధారణ బెడ్లు వెరశి 2 వందల బెడ్లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ ఆసుపత్రులలో ఇప్పటివరకు కేవలం 605 కేసులు మాత్రమే చికిత్స పొందుతున్నాయని, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 797 కేసులు ఉండగా, హోమ్ ఐసోలేషన్ లో 1136 కేసులు చికిత్స పొందుతున్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సకాలంలో చికిత్స పొందాలని కోరారు. లక్షణాలు ఉన్నప్పటికీ దాచిపెట్టడం వలన ఇంటివద్దనే ఉండిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి చేరాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇంటింటా జరుగుతున్న సప్త వార ప్రక్రియలో భాగంగా వాస్తవ సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. మంచి చికిత్స పొందాలని, వైద్యులు అందరూ మంచి సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా సోకిందనే వివక్ష అవసరం లేదని, ఎవరికైనా సోక వచ్చని ఆయన చెప్పారు. ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాల్లో వసతులు మరింత మెరుగు పరచుటకు చర్యలు చేపడుతున్నామని, సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా వైద్య పరీక్షలు నిర్వహించుటకు పీపుల్స్ లాబ్ ను ప్రజలు అందించిన విరాళాలతో ఏర్పాటు చేసామని చెప్పారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చందంగా వెళ్ళి పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు.