నాగేశ్వర్రారవు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి..
Ens Balu
4
Simhachalam
2020-11-27 16:13:47
విశాఖలోని సింహాచలం ఆర్టీసీ డిపో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు వేధింపుల మరణం కేసులో విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కృషితో బాధిత కుటుంబానికి రెట్టింపు నష్టపరిహారం రూ.4లక్షలు విడుదల చేసిన జిల్లా కలెక్టరుకు జాతీయ ఎస్సీకమిషన్ కు విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కన్వనర్ డా. బూసివెంకటరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దళిత సంఘాల ఐక్య వేదిక, ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలతో నష్టపరిహారం అభినందనీయమన్నారు. అదేసమయంలో నాగేశ్వరరావును వేధించి ఆత్మహత్యకు కారణమైన డిపో మేనేజర్ దివ్యను యాజమాన్యం కనిషం సస్పెండ్ చేయక పోవడం అన్యాయమన్నారు. ఇది వేధింపుల మరణం ఐనందున నిందితురాలు దివ్యను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, నాగేశ్వరరావు కుమారునికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలు నాగేశ్వర రావు భార్య అమ్మా జీ సంఘ నేతలకు కృతజ్ఞత తెలుపుతూ నాకొడుకుక్కి ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జి రాంబాబు, సోడ దాసి సుధాకర్, ఈతల పాక సుజాత , చొక్కాకుల రాంబాబు, నిమ్మిటి ధర్మారావు, బిరారత్నం తదితరులు పాల్గొన్నారు .