మానవత్వం చాటుకున్న నెల్లూరు పోలీస్..


Ens Balu
0
Chennai highway
2020-11-27 16:43:07

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం నెల్లూరు చెన్నై హైవేపై వరద నీరు వస్తున్న కారణంగా రోడ్లపై ఉన్న వాహనదారులకు, డ్రైవర్స్, ప్రయాణికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వరదల కారణంగా వీరంతా ఇక్కడే ఉండిపోవాల్సి రావడంతో వారి ఆకలి తీర్చాలని నెల్లూరు పోలీసులు బావించారు.  ప్యాకెట్స్ అందిస్తున్న నెల్లూరు రూరల్ సిఐ, వేంకటాచలసత్రం ఎస్ఐ ఆధ్వర్యంలో భోజనాలను అందించారు. అంతేకాకుండా వారికి మంచినీటిని కూడా సరఫరా చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర భూషన్ ఆదేశాలతో పోలీసులు తమ సేవలను విస్తరిస్తున్నారు. తుపాను సమయంలో జిల్లా పోలీసులు చేస్తున్న సేవలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీర్ఘప్రయాణాలు చేస్తున్న లారీ డ్రైవర్లు, ట్రక్కులు, ట్యాంకర్ల సిబ్బందికి తమకు చేస్తున్న సేవలను మరిచిపోలేమని చెబుతున్నారు..