ఎస్ఐ కుటుంబానికి రూ.10 కార్ఫస్ ఫండ్..
Ens Balu
3
ఎస్పీ కార్యాలయం
2020-11-27 17:02:19
ఆంధ్రప్రదేశ్ పోలీస్ లను ప్రభుత్వం విధిగా ఆదుకుంటుందని క్రిష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్ అన్నారు. శుక్రవారం చిలకల్లు పోలీస్ స్టేషన్ లో ఎస్సై2గా విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ తో మ్రుతి చెందిన అల్లు దుర్గారావు కుటుంబానికి ప్రభుత్వ కార్పస్ ఫండ్ రూ.పది లక్షల చెక్కును అందజేశారు. విధినిర్వహణసమయంలోనే కాకుండా మరణాంతరం కూడా పోలీసు శాఖ సిబ్బంది తోడుగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాకుండా శాఖా పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ను సాధ్యమైనంత తర్వగా వచ్చేలా చేయడంతోపాటు, కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం నియామకం కూడా సత్వరమే చేపడతామని అన్నారు. మా శాఖలో ఎస్ఐ ని కోల్పోవడం మీతోపాటు మాకూ బాధగా వుందని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.