జవహర్ నవోదయ దరఖాస్తుకు గడువు పెంపు..
Ens Balu
4
Anantapur
2020-11-27 17:47:34
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి ఎంపిక పరీక్షలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న బాల,బాలికలు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. వీరు తేదీ 01.05. 2008 నుండి 30.04.2012 మధ్యలో జన్మించిన వారై ఉండాలి .దరఖాస్తులను WWW.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూరించి తిరిగి అదే వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ఈ పరీక్షలు ఆంగ్లము, హిందీ, కన్నడ ఇతర భాషలతో పాటు తెలుగు భాషలో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను ఈసేవ, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు, సొంత మొబైల్లు, తదితర మార్గాల ద్వారా దరఖాస్తుడౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు పూరించి అప్లోడ్ చేసుకోవచ్చన్నారు .తేదీ 15.12.2020 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు .
అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవతరగతిలో మిగిలి ఉన్న సీట్లకుగాను తొమ్మిదవతరగతిలో ప్రవేశం కోరే బాల,బాలికలు కూడా పైన పేర్కొన్న వెబ్సైట్ ద్వారా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూరించి అదే వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాల్సిందిగా ఆయన తెలిపారు. 6,9 వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు తమ దరఖాస్తులను 2020 డిసెంబర్ 15 తేదీలోగా అప్లోడ్ చేయాలన్నారు.అప్లోడ్ చేసుకున్న దరఖాస్తులను ఒక ప్రింట్ అవుట్ తీసి తమవద్ద ఉంచుకోవాలన్నారు. ఆరవ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021 ఏప్రిల్ 10వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాగే తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021 ఫిబ్రవరి 13వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పించాలి అనుకునే ఆసక్తి గల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పై పేర్కొన్న తేదీలలో దరఖాస్తులను అప్లోడ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.