సచివాలయాల్లోనే అన్ని సేవలు అందాలి..


Ens Balu
2
Anantapur
2020-11-27 17:50:21

సచివాలయాల ద్వారా అన్ని శాఖలకు చెందిన సర్వీసులు ప్రజలకు అందించేలా తగుచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు .శుక్రవారం స్థానిక రామ్ నగర్ లోని 54,55 వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా సర్వీసులను ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ అక్కడి సిబ్బందితో ఆరా తీశారు. జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 1200 సర్వీసులు అందాయని అక్కడి సిబ్బంది తెలిపారు. ఈ సర్వీసులను ప్రజలకు మరింత ఎక్కువగా అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వార్డు సచివాలయ రికార్డులను పరిశీలించి ప్రస్తుతం 28 శాఖలకు చెందిన సర్వీసులు మాత్రమే అందిస్తున్నారన్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అన్ని రకాల సర్వీసులను సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడి సత్వరచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు సర్వీసులను పరిష్కరించాలని, గడువు ముగిసిన తర్వాత ఏ ఒక్క సర్వీసు కూడా పెండింగ్లో ఉండటానికి వీలులేదన్నారు. గడువు మీరిన సర్వీసులకు సంబంధించి సాంకేతిక సమస్యల వల్ల పరిష్కరించలేక పోయామని అక్కడి సిబ్బంది జిల్లా కలెక్టర్ తెలిపారు. సర్వీసుల పరిష్కారంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి,నగర పాలక సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.