సమిష్టిగా పనిచేయడమే అసలైన అవార్డు..
Ens Balu
3
Vizianagaram
2020-11-27 17:53:15
సానుకూల దృక్ఫథం, సమిష్టి కృషే తన విజయానికి కారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పేర్కొన్నారు. తనకు మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం పట్ల ఆయన స్పందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. సృజనాత్మకంగా పనిచేసేందుకు అవాకాశం రావడం కూడా ఒక వరమని, దానిని విజయనగరం జిల్లా తనకు కల్పించిందని చెప్పారు. మనస్ఫూర్తిగా పనిచేసుకుపోవడం, తనకు జిల్లా యంత్రాంగం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందడం తన విజయాలకు కారణాలని పేర్కొన్నారు. తాను ఎన్నడూ అవార్డులను ఆశించలేదని, అంకితభావం, చిత్తశుద్దితో ప్రణాళికాబ్దంగా పనిచేయడం వల్లే, అవార్డులు వాతంటత అవే వస్తున్నాయని చెప్పారు. మేన్ఆఫ్ ఎక్స్‌లెన్స్ గా తనను గుర్తించడమే కాకుండా, విజయనగరం జిల్లా పేరును కూడా ఎన్ఐఐఆర్‌డి రికార్డుల్లో చిరస్థాయిగా నిలపడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతీ కలెక్టర్ జిల్లా అభివృద్దిపై తనదైన ముద్ర వేయాలని, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి తరచూ చెప్పే మాటలు, ప్రోత్సాహం కారణంగా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నానని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు.