ఇంటింటికీ సచివాలయ సేవలు తెలియజేయాలి..


Ens Balu
1
Elamanchili
2020-11-27 19:02:55

గ్రామ సచివాలయాల ద్వారా  అందిస్తున్న సేవల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఆదేశించారు.  సచివాలయ పరిధిలోనున్న కుటుంబాల యింటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు.   శుక్రవారం కలెక్టరు  ఎలమంచిలి, కశింకోట మండలాల్లో పర్యటించారు. గ్రామ చివాలయాలు,రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాల పని తీరును పంశీలించారు.  భవన నిర్మాణ పనుల పురోగతిని తనిఖీ చేశారు.  షేక్ ఆలీపాలెం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు.  ప్రజలకు అందిస్తున్న సేవల  వివరాలు, వివిధ పధకాల  క్రింద లబ్ది దారుల వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పని ఉద్యోగులను వారి పని తీరును మెరుగు పరచుకొనకపోతే క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు.  సచివాలయంలో  డిస్స్లెబోర్డులో  ప్రదర్శించిన   లబ్దిదారుల జాబితా పరిశీలించారు.  షేక్ ఆలీపాలెం గ్రామం నుండి  ఒక్కరు కూడా కలెక్టరేట్ కు పిటిషన్ తో రాకుండా ప్రజలకు సంతృప్తి కరమైన  సేవలు అందించాలన్నారు.  సచివాలయం ద్వారా  ప్రభుత్వం ప్రజలకు  543రకాల సేవలను అందిస్తున్నదన్నారు ఈ సేవలు వివరాలన్ని  ప్రజలకు  తెలియజేయాలన్నారు. ఈ  సేవలపై కరపత్రాలను వివరంగా ముద్రించి గ్రామం లోని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని, జిల్లా వ్యాప్తంగా   మిగిలిన డి.ఎల్.డి.ఓ.లు కూడా అమలు చేయాలన్నారు.  డి.ఎల్.డి.ఓ సత్యన్నారాయణను ఆదేశించారు.