ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తిచేయాలి..
Ens Balu
3
Tirupati
2020-11-27 20:09:33
స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ , జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 19వ బోర్డ్ మీటింగ్ స్మార్ట్ సిటీ ఎం.డి., నగరపాలకసంస్థ కమిషనర్ గిరీష అధ్యక్షతన నగరపాలకసంస్థ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. చైర్మన్ భరత్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిధులతో డి.బి.ఆర్ హాస్పిటల్ రోడ్డులో స్కూల్ నిర్మాణానికి, శ్వాసతంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్లు నిర్మాణానికి, నగరంలోని పలు చెరువులు, కుంటల కట్టలు బలపరచాలని నిర్ణయించారు. గొల్లవాని గుంట, కొంకా చెన్నయ్య గుంట, కొరమేను గుంట మరియు పూల వాని గుంట చెరువుల సుందరీకరణకొరకు సుమారుగా ఆరు కోట్ల పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెంతుకోస్తు చర్చి నుండి కొత్తపేట కొరమేను గుంట కాలువ నిర్మాణం కొరకు ఐదు కోట్ల రూపాయలతో పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగినది మరియు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు మున్సిపల్ సిబ్బందికి అవసరమైన వాహనములు మరియు పరికరములు కొనుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వినాయక సాగర్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలన్నారు. , లీలామహల్ వద్ద నుండి శ్రీనివాసం వరకు మురుగునీరు సజావుగా వెళ్లేలా ఒక పెద్ద మురుగునీటి కాలువ నిర్మాణం, నగరంలో గస్తీ తిరిగే పోలీసులకు బ్యాటరీ స్కూటర్స్ బదులు పెట్రోల్ స్కూటర్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితోపాటు తుడా వి.సి. హరికృష్ణ, జి.ఎం. చంద్రమౌళి, ఎస్.ఈ. మోహన్, బోర్డ్ సభ్యులు రామచంద్రారెడ్డి,రమశ్రీ, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి ఎస్పీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.