గిరిజనుల దశాబ్ధాల కల సాకారం..


Ens Balu
4
Salur
2020-11-27 20:24:14

గిరిజనుల దశాబ్దాల కల సాకారం కానుందని సాలూరు ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ పిడిక రాజన్న దొర అన్నారు.  శుక్రవారం సాలూరు-దళాయి వలస రోడ్డు నుంచి  శంబర గ్రామం పోవు రహదారిలో కందులపదం గ్రామ సుమారుగా 5 .12 కోట్ల రూపాయల తో గోముఖీ నది పై కి.మీ.4/2-4 వద్ద నూతన వంతెన నిర్మాణ చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసి,కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజన్నదొర  మాట్లాడుతూ, రాష్ట్రం లో వివిధ జిల్లాల నుండి వచ్చి స్థిరపడిన రైతుల కారణంగా ఈ ప్రాంతం, ఇక్కడి రైతులు అభివృధి చెందారాన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు వేయని కారణంగా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి ఇబ్బందులను చూసిన మన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి  రోడ్డు వేసి గ్రామాల అభివృద్ధికి బయలు వేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు అన్నారు.  సుమారు ఆరు పంచాయతీ పరిధిలో ఉన్న కందుల పదం,కిట్టు పరువు, బుర్జ, మావుడి, పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు తదితర పంచాయతీ పరిధిలోని సుమారు 70 గిరిజన గ్రామాల ప్రజలకు ఈ వంతెన ఏంతో ఉపయోగపడుతుందన్నారు.  ఇటువంటి బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం శంకు స్థాపనలకే పరిమితమైందన అన్నారు. ప్రజలకు చాలా అవసరమైన వంతెన అని ముఖ్య మంత్రి  జగన్మోహన్ రెడ్డికి తెలిపి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్.అండ్.బి ఇంజనీరింగ్ ఆధికారులు, మండల ఆధికారులు, పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.