స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానమే లక్ష్యం..


Ens Balu
7
జివిఎంసీ కార్యాలయం
2020-11-27 20:49:27

స్వచ్ఛ సర్వేక్షణ్ 2021పోటీలో మెరుగైన ర్యాంకు సాధనకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధం కావాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం, ఆమె ఛాంబరులో జివిఎంసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2021 సంవత్సరంనకు జరుగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలకు అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ లో సర్వే బృందం ఏ ఏ అంశాలపై తనిఖీ చేస్తారో అందుకు కావలసిన విధంగా డాక్యుమెంటు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 6,000 మార్కులు ఉంటాయని అందుకు అనుగుణంగా ప్రతీ విభాగపు ప్రధాన అధికార్లు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఇంజినీరు వారికి ఆదేశాలిస్తూ, ప్రజా / సామాజిక మరుగుదొడ్లు రిపేర్ల కొరకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మేజర్ కాలువల్లో పూడికలు తీసే చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ సామగ్రి మొదలగునవి పార కుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కాలువలపై చెత్త వేయరాదనే బోర్డులు పెట్టాలన్నారు.   శానిటరీ ఇన్ స్పెక్టర్ ద్వారా కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. రోడ్లపై గోతులు, కాలి బాటలు యు.జి.డి. లైన్లు యొక్క పునర్నిర్మాణ పనులు త్వరితగతిని చేపట్టాలని ఆదేశించారు. ఈ పనులన్నియూ డిశంబరు 15వ తేది లోగా పూర్తిచేయాలన్నారు.     వాటర్ ప్లస్ సంబందించిన అన్ని పనులు డిశంబరు 15వ తేది లోగా పూర్తీ చేయాలని, నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు వారిని ఆదేశించారు. గృహముల నుండి యు.జి.డి. పైపు లైనులకు అనుసంధానం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శుద్ధి చేసిన మురుగు నీరును స్వంత అవసరాలకు వినియోగించేటట్లు ఉద్యాన శాఖ అధికారులతో కలసి ప్రణాళిక చేపట్టాలన్నారు. ఆర్. & డి. వ్యర్ధాలను ప్రణాలికా బద్దంగా నిర్వహించే విధానాల డాక్యుమెంట్లను సిద్దం చేయాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో భాగంగా ఆయా శాఖల భాగస్వామ్యాన్ని అందించాలని ఉద్యానశాఖ,  యు.సి.డి. ప్రాజెక్టు డైరెక్టరు, విద్యా విభాగపు డిప్యూటీ విద్యా శాఖాదికారిని ఆదేశించారు. ప్రతీ రోజూ వివిధ విభాగాల ప్రధాన అధికారులు తన విధుల నిర్వర్తించే క్రమాలలో 25 శాతం కాలాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై  కేటాయించాలన్నారు. వివిధ శాఖల మధ్య చేయవలసిన అగ్రిమెంట్లు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదనపు కమిషనర్ దా. వి. సన్యాసి రావు, స్వచ్ఛ సర్వేక్షణ్ లో వివిధ కేటగిరీల కింద కేటాయించిన మార్కులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులకు వివిరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు  ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, చీఫ్ మెడికల్ అఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, పి.డి. (యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏ.డి. ఎం. దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు తదితరులు పాల్గొన్నారు.