డిప్యూటీ సీఎం పుష్ఫవాణి ఖాతలో మరో అభివ్రుద్ధి..


Ens Balu
3
Kurupam
2020-11-28 12:11:13

ఆ మంత్రికి చదువు విలువేంటో తెలుసు..విద్యాలయాలకు భవనాలు వస్తే విద్యార్ధుల భవిష్యత్తు ఎలావుంటుందో ఇంకా బాగా తెలుసు..నాడు ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం..నేడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విధానం నియోజవర్గానికి శాస్వత అభివ్రుద్ధి సాకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో  కురుపాం మండలం తేకరఖండిలో జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు 105.32 ఎకరాలు భూమి కేటాయించడంతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అభివ్రుద్ధిలో మరో మైలురాయి దాటినట్టు అయ్యింది. ఆది నుంచి విద్య, వైద్యం, గిరిజనుల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రీకరించే మంత్రి తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మంజూరు చేయించుకోవాలని చూస్తున్న జెఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజి భవంతుల అవసరాలకు భూమి కేటాయింపులు చేయించుకోగలిగారు. భూమి కేటాంయిపునకి లైన్ క్లియర్ కావడంతో ఇక భవనాలపై ఆమె ద్రుష్టి పెట్టనున్నారు. నాడు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సికిసెల్ ఎనీమియాపై పోరాటం చేసి మరీ న్యూట్రిషన్ ఫుడ్ కేంద్రాలు, మెడికల్ సెంటర్లు మంజూరు చేయించిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఇపుడు నియోజకవర్గ అభివ్రుద్ధిలోనూ అదే స్థాయి చొరవ తీసుకుంటూ ముందుకెళ్లడం పట్ల నియోజకవర్గ ప్రజల నుంచే కాకుండా సహచర మంత్రులు, ఎమ్మెల్యే నుంచి కితాబు పొందుతున్నారు. ఏదైనా ఒక దూరద్రుష్టి గల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తే అభివ్రుద్ధి ఈ స్థాయిలోనే చేస్తారనడానికి డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీనివాణి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.