శ్రీకాకుళం జిల్లాలోని విభిన్నప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో దరఖాస్తు చేసుకొని విద్యార్హతల దృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులు డిసెంబర్ 6లోగా
www.dw2020backlogsklm.in వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవన్ బాబు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.
2019-20 సం.నకు విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు సంబంధించి క్లాస్–4, గ్రూప్–4 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకై 2020 మార్చి 26లోగా పై తెలిపిన వెబ్ సైట్ నందు దరఖాస్తుతో పాటు విద్యార్హతలను నందు అప్లోడ్ చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. కానీ కోవిడ్, లాక్ డౌన్ కారణంగా
646 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ విద్యార్హతలను అప్ లోడ్ చేయలేదని చెప్పారు. దరఖాస్తు చేసుకొని విద్యార్హతల ధృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులు డిసెంబర్ 6వ సాయంత్రం 5.00గం.లలోగా సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. నిర్ణీత తేదీ ముగిసిన తర్వాత ధృవపత్రాలను అప్ లోడ్ చేయుటకు వీలుపడదని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. అప్ లోడ్ చేయగోరు అభ్యర్ధులు తమ పరిధిలో గల మండల అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారంతో సదరు వెబ్ సైట్ నందు అభ్యర్ధి యొక్క ఆధార్ నెంబర్ లేదా ఇదివరకు దరఖాస్తు చేసుకున్న రిజిస్టర్ నెంబరుతో అప్లికేషన్ తెరచి విద్యార్హతల ధృవపత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు దరఖాస్తు చేసుకొని విద్యార్హతల ధృవపత్రాలను సమర్పించని అభ్యర్ధులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.