పడవనడపుకుంటూ క్షతగాత్రులను పరామర్శిస్తూ..


Ens Balu
2
ఆత్మకూరు
2020-11-28 14:51:44

ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ఓ హోదాతోనే వెళతారు..ఆఖరికి వరదముంపులకు కూడా మందీ మార్భలంతోనే ఎవరినీ ముట్టుకోకుండానే వెళతారు..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని మంత్రులు దానికి పూర్తిగా భిన్నం. తుపాను తాకిడి దెబ్బతిన్న ప్రాంతాలను చూడటానికి వెళ్లడానికి మంత్రి పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాత్రం స్వయంగా తానే పడవను తెడ్డువేసుకొని నొడుపుతూ వేళ్లారు. శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు  నియోజకవర్గంలోని సంగం మండలం వీర్లగుడిపాడు సందు సందులన్నీ కలియతిరుగుతూ పరిస్థితులను సమీక్షించి, ఎంత వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగని విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు. దాదాపు అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చినా ఇంకో 100 మందికి పైగా గ్రామంలో ఉండడంతో అక్కడికి స్వయంగా పడవ నడుపుతూ వెళ్లి పలకరించారు. పడవ నడిపేవారు తాము నడుపుతామని చెప్పినా.. ఆ తెడ్డు అందుకోండి నేనే పడుపుతానంటూ పడవ ప్రయాణం సాగించారు. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి కట్టించి శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు... వరద వస్తున్న నేపథ్యంలో ముందు ముందు ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.