ఏయూ వీసీని మర్యదపూర్వకంగా కలిసిన నన్నయ వీసీ..
Ens Balu
3
Visakhapatnam
2020-11-28 15:44:15
ఆంధ్ర విశ్వవిద్యాలయం 18వ ఉపకులపతిగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకలపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఆంధ్ర ఆదికవి విశ్వవిద్యాలయాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను, అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించారు. రాష్ట్రాంలోని ఉన్నత విద్య అభివృద్ధికి కలిసి పని చేద్దామని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వీసీ మొక్కా జగన్నాథరావు అందజేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కీలకమైన వీసీ, రెక్టార్, రిజిష్ట్రార్ పదవులను చేపట్టిన తొలి వ్యక్తిగా, విద్యావేత్తగా, ఉత్తమ పరిశోధకులుగా ప్రసాదరెడ్డి ఉన్నారని అన్నారు. విశ్వవిద్యాలయ క్రమశిక్షణకు, విద్యార్థుల సంక్షేమానికి, నూతన ఆవిష్కరణలకు ప్రసాదరెడ్డి ప్రాధన్యతనిస్తున్నారని తెలిపారు. శతజయంతిలోనికి అడుగుపెడుతున్న ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నూతన పాలనలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఉన్నత విద్యాభివృద్దికి కృషి చేస్తామని తెలియజేసారు.